HomeTelugu Big Storiesబాలకృష్ణతో నేను సమానం కాదు.. రూట్‌ మార్చిన మెగా బ్రదర్‌

బాలకృష్ణతో నేను సమానం కాదు.. రూట్‌ మార్చిన మెగా బ్రదర్‌

6 7
లాక్‌డౌన్ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వంలో టాలీవుడ్ ఇండస్ట్రీ పెద్దలు జరిపిన చర్చలకు తనని పిలవలేదని బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే సృష్టించాయి. అంతేకాదు టాలీవుడ్ ఇండస్ట్రీ పెద్దలు మంత్రి తలసానితో కలిసి భూములు పంచుకోవడానికి మాత్రమే కలిసారంటూ కామెంట్స్ చేయడం హాట్‌ టాపిక్‌గా మారింది. దీనిపై మెగా బ్రదర్ నాగబాబు.. బాలయ్యను నోరు అదుపులో పెట్టుకోమంటూ వ్యాఖ్యనించడం వివాదంగా మారాయి. ఈయన కామెంట్స్‌తో మరోసారి నందమూరి, మెగా కంపౌండ్స్ మధ్య వైరం బయటికి వచ్చింది. కాగా ఈ వివాదంపై బాలయ్య స్పందించడానికి నిరాకరించారు. తాజాగా నాగబాబు.. ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బాలయ్య ఇష్యూపై స్పందించాడు. తెలంగాణ ప్రభుత్వంతో టాలీవుడ్ ఇండస్ట్రీ జరిపిన చర్చలకు బాలకృష్ణను పిలకపోవడం తప్పా ? రైటా ? అనేది తనకు తెలియదన్నారు. అయితే బాలయ్య మాత్రం టాలీవుడ్ ఇండస్ట్రీ వాళ్లు రియల్ ఎస్టేట్ కోసమే కలిసారంటూ చేసిన వ్యాఖ్యలనే తాను ఖండించానన్నాడు. ఈ విషయంలో బాలకృష్ణ తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకొని సినీ పరిశ్రమకు క్షమాపణలు చెప్పాలని మాత్రమే తాను కోరాను అని అన్నారు.

ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ.. బాలకృష్ణతో నాకెలాంటి విభేదాలు లేవు. భూములు విషయమై ఆయన మాట్లాడినందుకే ఆవేశపడ్డానన్నారు. ఆయనకంటూ ప్రత్యేక గౌరవం ఉందన్నారు. నేను బాలకృష్ణను టార్గెట్ చేయలేదు. ఆయన మాట్లాడింది తప్పు అని మాత్రమే చెప్పాను. ఆయనతో నాకు వ్యక్తిగత ఎలాంటి గొడవలు లేవు. బాలకృష్ణ టాలీవుడ్‌లో పెద్ద హీరో. నేను చిరంజీవి తమ్ముడిని. అదీ కాక ఓ నటుడిని నిర్మాతను కూడా. మా ఇద్దరి మధ్య అసలు పోలికలే లేవన్నారు. ఆయనతో నేను ఎప్పుడు సమానం అని చెప్పుకోన్నారు. ఇక బాలకృష్ణతో నాకు వ్యక్తిగతంగా పెద్దగా పరిచయం లేదు. కలిసినపుడు హాయ్ అంటే హాయ్ అని పలకరించుకుంటాం. ఒకవేళ బాలయ్య కాకున్నా.. ఎవరు ఈ విషయాన్ని మాట్లాడిని నేను స్పందించేవాడినన్నారు. ఇక మీడియా కూడా ఇండస్ట్రీలో ఏమి జరిగినా.. ఏదో మూడో ప్రపంచ యుద్ధం జరిగినట్లు భూతద్దంలో పెద్దదిగా చూపిస్తోంది. మా గొడవలు అన్నీ టీకప్పులో తుఫాను వంటివి అంటూ వివాదానికి ఫుల్‌స్టాప్ పెట్టాడు. ఐతే.. జూన్ 9న టాలీవుడ్ ఇండస్ట్రీల పెద్దలు ఏపీ సీఎం జగన్‌తో భేటీ కానున్నారు. ఈ భేటికి బాలకృష్ణ హాజరు కావడం లేదు. తన పుట్టినరోజు వేడుకల సందర్భంగా బాలయ్య ఈ భేటికి హాజరు కావడం లేదన్న సంగతి నిర్మాత కళ్యాణ్ వెల్లడించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!