బాలయ్య ఎవరో నాకు తెలియదు.. నాగాబాబు సంచలన వ్యాఖ్యలు

మెగా బ్రదర్‌ నాగబాబు తాజా ఇంటర్వ్యూలో చేసిన కామెంట్‌ ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది. నందమూరి బాలకృష్ణ ఎవరో తనకు తెలియదని, ఆయన పేరు వినలేదని సీరియస్‌గా సమాధానమిచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. దర్శకుడు ఆర్జీవీ, నందమూరి బాలకృష్ణ (బాలయ్య)లపై నాగబాబు అభిప్రాయాన్ని కనుక్కోవాలని ఓ వ్యూయర్ అడిగారు. తన అభిప్రాయాన్ని చెప్పాలని నాగబాబును అడిగారు. ఆర్జీవీ గురించి మాట్లాడుతూ ఆయనపై మాట్లాడటం తనకు ఇష్టం లేదన్నారు. ఖైదీ నెంబర్ 150 పంక్షన్‌లో అతడి గురించి చెప్పేశాను.

ఆయన మాట్లాడే మాటల వల్ల ఆర్జీవీపై ఉన్న అభిప్రాయం కూడా పోయింది. అతడి కూడా చెప్పడానికి ఏం లేదన్నారు. బాలయ్య బాబు గురించి చెప్పాలని అడగగా నాకు ఆయనెవరో తెలియదని కామెంట్ చేశారు. ఆ వెంటనే తమాయించుకున్న నాగబాబు.. బాలయ్యగారు పెద్ద ఆర్టిస్ట్. ఆయనను నేనేలా మరిచిపోతాను. నేరము శిక్షలో కృష్ణగారితో కలిసి నటించారని చెప్పారు. అయితే బాలయ్య అంటే నందమూరి బాలకృష్ణ అని యాంకర్ వివరించగా.. తనకు బాలకృష్ణ ఎవరో తెలియదని, ఆయన గురించి తానెప్పుడూ వినలేదని సింపుల్‌గా సమాధానమిచ్చారు నాగబాబు. దీంతో యాంకర్ మైండ్ బ్లాంక్ అయింది. బాలయ్య అభిమానులు మాత్రం ఇంత అహంకారం పనికిరాదు అంటూ నాగబాబుపై కామెంట్ చేస్తున్నారు.