HomeTelugu Trendingసమంత బర్త్‌డే స్పెషల్‌.. కేక్‌ చేసిన చైతూ.!

సమంత బర్త్‌డే స్పెషల్‌.. కేక్‌ చేసిన చైతూ.!

1 27
అక్కినేని సమంత పుట్టిన రోజు సందర్భంగా ఆమె భర్త నాగచైతన్య ఆమె కోసం గరిట తిప్పారు. “ఏం మాయ చేసావే” సినిమాలో కలిసి నటించిన ఈ జంట ఆ తరవాత ప్రేమించుకుని ఒక్కటైయ్యారు. తల్లి దండ్రుల సమక్షంలో వైభవంగా పెళ్లి చేసుకుని ప్రస్తుతం చూడ చక్క జంటగా జీవిస్తున్నారు. మూవీ ఇండస్ట్రీలో ప్రేమ పెళ్ళిళ్ళు సాధరణ విషయమే కానీ పెళ్లి చేసుకున్నాక కలిసి జీవించే జంటలు చాలా తక్కువ. కానీ చై స్యామ్ మాత్రం అందుకు భిన్నంగా కనిపిస్తారు. ఒకరిపై మరొకరు ప్రేమను కురిపించుకుంటూ అందరినీ ఆకర్షిస్తుంటారు. ఇప్పుడు తాజాగా చైతన్య సమంతపై తనకున్న ప్రేమను మరోసారి నిరూపించుకున్నారు. సోమవారం ఆమె పుట్టినరోజు సందర్భంగా చైతన్య స్వయంగా కేక్ తయారు చేసి పెట్టాడు. ఈ విషయాన్ని సమంత తన అభిమానులతో షేర్ చేసుకుంది. సమంత కట్ చేసిన కేక్ ను భర్తకు తినిపించింది. ఈవీడియోను, ఫోటోలను సమంత తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో అప్‌లోడ్ చేయడంతో అవి వైరల్‌గా మారాయి. ఇక ఆమె పోస్ట్ కు “కుటుంబం, ప్రేమ… నేను ఏం కోరుకుంటున్నానో మీరు ఊహించలేరు” అంటూ కాప్షన్ పెట్టారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!