నాగచైతన్య, సమంత ఫన్నీ వీడియో చూశారా!

అక్కినేని నాగచైతన్య, సమంత నటించిన ‘మజిలీ’ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దివ్యాంశా కౌశిక్‌ మరో హీరోయిన్‌గా నటించారు. సినిమా ప్రచార కార్యక్రమాల్లో భాగంగా చై, సామ్‌ ‘గెస్‌ ది వర్డ్‌’ అనే ఫన్నీ ఆట ఆడారు. దీనికి సంబంధించిన వీడియోను ‘మజిలీ’ చిత్రాన్ని నిర్మించిన షైన్‌ స్క్రీన్‌ క్రియేషన్స్‌ ట్విటర్‌ వేదికగా విడుదల చేసింది. సమంత హెడ్‌ఫోన్స్‌ పెట్టుకుంటే.. చైతన్య ఓ పదం చెబుతాడు. ఆ పదమేంటో సమంత కనిపెట్టాలన్నది ఆట. ఈ నేపథ్యంలో సమంత హెడ్‌ఫోన్స్‌ తలపై కాకుండా చెవుల కింది నుంచి పెట్టుకోవాలనుకున్నారు. అది చూసి చైతూ.. ‘సరిగ్గా పెట్టుకో’ అన్నారు. అప్పుడు సామ్‌.. ‘నా జుట్టు పాడవుతుంది.. ఇలా పెట్టుకున్నా కూడా నాకేం వినిపించట్లేదు’ అంటే.. ‘ఏం కాదు.. ప్రేక్షకులు చూస్తున్నారు. నిన్ను నమ్మను’ అనడం ఫన్నీగా ఉంది. ఆటలో భాగంగా చైతూ.. ‘నువ్వు అందంగా లేవ్’ అన్నారు. సమంత హెడ్‌ఫోన్స్‌ పెట్టుకోవడంతో అతను ఏమన్నారో అర్థంకాక అలా చూస్తుండిపోవడం నవ్వులు పూయిస్తోంది. ఎంతో చూడముచ్చటగా ఉన్న ఈ వీడియోను మీరూ చూసేయండి..!

CLICK HERE!! For the aha Latest Updates