HomeTelugu Trending'మాచర్ల నియోజకవర్గం' లో నితిన్, కృతిశెట్టి న్యూ లుక్

‘మాచర్ల నియోజకవర్గం’ లో నితిన్, కృతిశెట్టి న్యూ లుక్

Nithin Macharla new look
నితిన్‌ హీరోగా నటిస్తున్న కృతి శెట్టి, కేథరిన్‌ థ్రెసా హీరోయిన్లుగా “మాచర్ల నియోజకవర్గం” రూపొందుతోంది. ఈ చిత్రానికి ఎంఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. రాజ్‌కుమార్‌ ఆకెళ్ల సమర్పణలో శ్రేష్ట్‌ మూవీస్‌ బ్యానర్‌పై సుధాకర్‌ రెడ్డి, నికితారెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమా చివరి పాట మినహా షూటింగ్‌ పార్ట్ పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి సంబంధించి నితిన్, కృతీశెట్టి న్యూ లుక్‌ను చిత్రబృందం విడుదల చేసింది.

పక్కా మాస్, కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిస్తున్నట్లు దర్శక, నిర్మాతలు వెల్లడించారు. ఈ చిత్రంలో పొలిటికల్‌ ఎలిమెంట్స్‌ కూడా ఉన్నాయన్నారు. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటోంది. మిగిలిన ఒక పాటను త్వరలో చిత్రీకరించనున్నట్లు తెలిపారు. ఆగస్ట్‌ 12న సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి మహతి స్వరసాగర్ సంగీతం అందిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu