HomeTelugu Newsనాగశౌర్య తో మెహరీన్‌

నాగశౌర్య తో మెహరీన్‌

4 11యంగ్‌ హీరో నాగశౌర్య కొత్త సినిమా ఆరంభమైంది. ఈ చిత్రంలో మెహరీన్‌ హీరోయిన్‌గా నటించనున్నారు. ఐరా క్రియేషన్స్‌ పతాకంపై నాగశౌర్య తల్లి ఉషా ముల్పూరి నిర్మిస్తున్నారు. నూతన దర్శకుడు రమణ తేజ సినిమాను తెరకెక్కిస్తున్నారు. శ్రీచరణ్‌ పాకాల సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఐరా నుంచి వస్తోన్న మూడో సినిమా ఇది. ఈ సినిమా పూజా కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. తొలి సన్నివేశానికి దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు క్లాప్‌ కొట్టారు. తన సొంత నిర్మాణ సంస్థలో కొత్త ప్రాజెక్టును ప్రకటించడం చాలా సంతోషంగా ఉందని ఈ సందర్భంగా నాగశౌర్య ట్వీట్‌ చేశారు.

‘నర్తనశాల’ తర్వాత నాగశౌర్య ‘ఓ బేబీ’ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో సమంత హీరోయిన్‌ పాత్ర పోషిస్తున్నారు. నందినిరెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మిక్కీ జే మేయర్‌ బాణీలు అందిస్తున్నారు. లక్ష్మి, రావు రమేశ్‌, ఊర్వశి, రాజేంద్ర ప్రసాద్‌ ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu