శ్రీవారిని దర్శించుకున్న ‘ఉప్పెన’ టీమ్‌

మెగా మేనల్లుడు హీరో వైష్ణవ్‌ తేజ్ తన తొలి సినిమా ‘ఉప్పెన’తో హిట్ కొట్టిన ఆనందంలో ఉన్నాడు. ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించిన కృతి శెట్టికి పలు ఆఫర్‌లు వ‌స్తున్నాయి. ఈ సినిమా భారీ వ‌సూళ్ల‌ను రాబ‌డుతోంది. ఉప్పెనలా ఉప్పొంగుతున్న సంతోషంలో ఉన్న ఈ సినిమా యూనిట్ ఈ రోజు తిరుమ‌ల‌ శ్రీవారిని ద‌ర్శించుకుంది. వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి, నిర్మాత నవీన్, డైరెక్టర్ బుచ్చిబాబు, తదితరులు శ్రీవారిని ద‌ర్శించుకున్నారు. హీరో, హీరోయిన్లు కాలినడకన కొండెక్కడం గ‌మ‌నార్హం. వారు కొండెక్కుతుండ‌గా తీసిన వీడియోలు, ఫొటోలు సోషల్‌ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

ఈ సినిమా డైరెక్టర్‌ బుచ్చిబాబు ఆలయం వెలుపల ఈ సంద‌ర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ఈ సినిమా స్క్రిప్ట్‌ను స్వామి వారి పాదాల చెంత ఉంచి ఆశీస్సులు పొందామ‌ని, అందుకే ఈ సినిమా విజ‌యం సాధించింద‌ని చెప్పారు. తన తదుపరి సినిమా స్క్రిప్ట్‌ను కూడా శ్రీవారి పాదాల చెంత ఉంచి ఆశీస్సులు పొందానని తెలిపారు. ఈ సినిమా వివ‌రాల‌ను త్వరలోనే చెబుతాన‌ని వెల్ల‌డించారు. కాగా, ఉప్పెన సినీ బృందంతో తుడా చైర్మన్‌ చెవి రెడ్డి కూడా ఉన్నారు.

 

CLICK HERE!! For the aha Latest Updates