HomeTelugu Trendingచిట్టి సితార డాన్స్‌ చూశారా!

చిట్టి సితార డాన్స్‌ చూశారా!

5 10
సూపర్‌స్టార్‌ మహేశ్‌ బాబు కూతురు సితారకు సంబంధించిన వార్తలు, వీడియోలపై నెటిజన్లు బాగా ఆసక్తి కనబర్చుతారు. తాజాగా సితారకు సంబంధించిన అప్ డేట్లను తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో మహేశ్ భార్య నమ్రత పోస్ట్ చేస్తుంటుంది. ఆమె పోస్ట్ చేసిన ఓ వీడియో అభిమానులను అలరిస్తోంది.

పచ్చని మొక్కల మధ్య కొన్నేళ్ల క్రితం ఈస్టర్‌ సందర్భంగా సితార డ్యాన్స్‌ చేసింది. అప్పటి వీడియోను నమ్రత పోస్ట్ చేసింది. ఈ వీడియోలో చిట్టి సితార చేతులు, కాళ్లు కదిలిస్తూ డ్యాన్స్ చేస్తుండడం అబ్బురపరుస్తోంది. ఆమెను చూసిన మహేశ్ బాబు చిరునవ్వులు చిందించాడు. ఇటీవల సితార సరిలేరు నీకెవ్వరు సినిమాలోని ‘డ్యాంగ్ డ్యాంగ్’ పాటకు అదిరిపోయే స్టెప్పులేస్తూ డ్యాన్స్ చేసి అందరి దృష్టినీ ఆకర్షించిన విషయం తెలిసిందే. సామాజిక మాధ్యమాల్లో మంచి క్రేజ్ తెచ్చుకున్న మహేశ్ బాబు కూతురు సితారకు సంబంధించిన వీడియోలు మహేశ్ బాబు అభిమానులను అలరిస్తుంటాయి. గతంలోనూ తన తండ్రి సినిమా పాటలను పాడిన ఆమె వీడియోలు సామాజిక మాధ్యమాల్లో తెగ హల్‌చల్‌ చేసి, ఆ సినిమాలకు మరింత పబ్లిసిటీ తెచ్చిపెట్టాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!