రజనీకాంత్‌తో హాలీవుడ్‌ స్టార్‌!

సూపర్‌ స్టార్ట్‌ రజినీకాంత్ నటిస్తున్న ‘దర్బార్’ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతున్నది. ఆగష్టు తో సినిమా షూటింగ్ పూర్తికానుంది. రజినీకాంత్ పవర్ఫుల్ కాప్ గా కనిపిస్తున్న ఈ మూవీలో నయనతార హీరోయిన్. ఇదిలా ఉంటె, రజినీకాంత్ సినిమాలో నటించాలని ఉందని హాలీవుడ్ స్టార్ యాక్టర్ బిల్ డ్యూక్ ట్వీట్ చేశారు.

రజిని సోదరుడిగా కానీ, నయనతారకు అంకుల్ గా కానీ నటించాలని ఉందని, అవకాశం ఇస్తే చేస్తానని చెప్పి మురుగదాస్ కు ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ చూసిన మురుగదాస్ షాక్ అయ్యాడు. బిల్ డ్యూక్ వంటి స్టార్ యాక్టర్ సినిమా చేస్తాను అవకాశం ఇవ్వమని అడిగితె కాదని అంటాడా మురుగదాస్. ప్రస్తుతం ఆయన కోసం ఓ క్యారెక్టర్ ను సిద్ధం చేస్తున్నారని సమాచారం.