ఎన్టీఆర్ సినిమాకు అనిరుధ్ మ్యూజిక్!

యంగ్ టైగర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం త్రివిక్రమ్.. పవన్ కల్యాణ్ సినిమాను పూర్తి చేసే పనిలో పడ్డాడు. అది పూర్తయిన తరువాత ఎన్టీఆర్ తో సెట్స్ పైకి వెళ్లనున్నాడు. అయితే పవన్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోన్న అను ఎమ్మాన్యూయల్ ను ఎన్టీఆర్ సినిమాలో హీరోయిన్ గా త్రివిక్రమ్ కన్ఫర్మ్ చేశాడని అంటున్నారు. ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ ను కూడా రిపీట్ చేయబోతున్నాడని టాక్. 
తమిళంలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ అయిన అనిరుధ్ ను పవన్ కల్యాణ్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయనున్నాడు త్రివిక్రమ్. ఇప్పుడు త్రివిక్రమ్ చేయబోయే తదుపరి చిత్రానికి కూడా అనిరుధ్ ను తీసుకోవాలని భావిస్తున్నాడు. అనిరుధ్ కూడా ఈ విషయంలో సముఖంగా ఉన్నాడని తెలుస్తోంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో అనిరుధ్ సంగీత సారధ్యంలో ఎన్టీఆర్ తెరపై మరింత కొత్తగా కనిపిస్తాడని అభిమానులు భావిస్తున్నారు. నవంబర్ లో ఈ సినిమా మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.