‘కాలా’ లో నానాపటేకర్!

కబాలి సినిమా వసూళ్ల ప్రభంజనం సృష్టించడంతో ఆ చిత్ర దర్శకుడు రంజిత్ తో మరోసారి సినిమా చేయడానికి రెడీ అయ్యాడు రజినీకాంత్. ఈ సినిమాకు కాలా అనే టైటిల్ ను ఫిక్స్ చేసి సినిమా ఫస్ట్ లుక్ ను కూడా విడుదల చేశారు. ముంబై మాఫియా నేపధ్యంలో ఈ కథను రూపొందించారు. దీంతో సినిమాలో చాలా వరకు చిత్రీకరణ ముంబైలోనే జరగనుంది. ఇటీవల సినిమా షెడ్యూల్ ముంబైలో మొదలుపెట్టారు.

తమిళ, తెలుగు, హిందీ భాషల్లో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. దీంతో ఆయా భాషలకు చెందిన నటీనటులను ఎంపిక చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే తమిళ నటుడు సముద్రఖని అలానే హుమా ఖురేషీని ఎంపిక చేసుకున్నారు. తాజాగా బాలీవుడ్ నటుడు నానాపటేకర్ కు ఈ సినిమాలో చోటు దక్కింది. ఈ సినిమాలో ఆయనది కీలక పాత్ర అని సమాచారం. ముంబై నలభై రోజుల పాటు చిత్రీకరణ కొనసాగనుంది.