నాని దూకుడు పెంచాడు!

క్రేజ్ ఉన్నప్పుడే క్యాష్ చేసుకోవాలనే ఆలోచనతో వరుస సినిమాలను లైన్ లో పెడుతూ.. తన దూకుడు ప్రదర్శిస్తున్నాడు నాని. ఈ మధ్యకాలంలో వరుస విజయాలను అందుకుంటూ.. నిర్మాతల హీరోగా మారిపోయాడు. నానితో సినిమా చేస్తే మినిమమ్ గ్యారంటీ అనే స్టాంప్ పడిపోయింది. నాని కూడా మంచి అంశాలున్న కథలు ఎన్నుకుంటూ.. అనుకున్న బడ్జెట్ ను మించకుండా ప్లాన్ చేసుకుంటున్నాడు. రీసెంట్ గా ‘నేను లోకల్’ సినిమాతో సక్సెస్ అందుకున్న నాని ప్రస్తుతం ‘నిన్ను కోరి’ సినిమా షూటింగ్ లో బిజీగా గడుపుతున్నాడు.క్రేజ్ ఉన్నప్పుడే క్యాష్ చేసుకోవాలనే ఆలోచనతో వరుస సినిమాలను లైన్ లో పెడుతూ.. తన దూకుడు ప్రదర్శిస్తున్నాడు నాని. ఈ మధ్యకాలంలో వరుస విజయాల
అయితే ఈ సినిమా తరువాత దిల్ రాజు బ్యానర్ లో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ‘ఎంసిఏ’ సినిమా చేయబోతున్నాడు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమాతో పాటు తనకు ‘కృష్ణగాడి వీరప్రేమ గాథ’ వంటి మంచి సక్సెస్ ఫుల్ సినిమా ఇచ్చిన హను రాఘవపూడితో మరో సినిమా కన్ఫర్మ్ చేశాడు. అలానే మేర్లపాక గాంధీ కథకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక తరువాత రాబోయే రోజులు మొత్తం నాని తన దూకుడు చూపించడానికి రెడీ అయిపోయినట్లే!