నాని.. నెక్స్ట్ ఏంటి..?

నేను లోకల్ సినిమా పూర్తి చేసిన తరువాత నాని తన కొత్త సినిమా షూటింగ్ కోసం అమెరికా వెళ్ళాడు. శివ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా కోసం భారీ షెడ్యూల్ ను అక్కడే పూర్తి చేశారు. నిన్ను కోరి అని సినిమా టైటిల్ ఫిక్స్ చేసి ఓ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. ప్రతిసారి తన సినిమా సెట్స్ పై ఉండగానే మరో సినిమాకు కొబ్బరికాయ కొట్టే నాని ఈ సారి మాత్రం ఎందుకో లేట్ చేస్తున్నాడు. ప్రస్తుతం అయితే దిల్ రాజు నిర్మాణంలో ఓ సినిమా అలానే అవసరాల శ్రీనివాస్ తో మరో సినిమా చేయడానికి ప్లాన్ చేసుకున్నాడు.

మరి ముందుగా ఈ రెండు సినిమాలో ఏది మొదలవుతుందో చెప్పలేని పరిస్థితి. అవసరాల ప్రస్తుతం నటుడిగా బిజీ ఉండడంతో డైరెక్టర్ గా మరో సినిమా చేయడానికి గ్యాప్ రావడం ఖాయం. దిల్ రాజు ప్రస్తుతం భార్యను పోగొట్టుకున్న బాధలో కొత్త సినిమాను ఎప్పుడు మొదలు పెడతారో.. చెప్పలేకపోతున్నారు. ఈలోగా నాని ‘నిన్ను కోరి’ సినిమా మిగిలిన షెడ్యూల్ ను కూడా పూర్తి చేసే ప్లాన్ లో ఉన్నాడు.