
HIT 3 box office:
నేచురల్ స్టార్ నాని.. ఈ పేరే ఇప్పుడు ఓ బ్రాండ్‌లా మారిపోయింది. కరోనా తర్వాత బాక్సాఫీస్ వద్ద కంటిన్యూగా డీసెంట్ హిట్స్ ఇస్తూ వస్తున్న నాని, ఇప్పుడు మరోసారి ప్రొడ్యూసర్‌గా మ్యాజిక్ చేసి చూపించాడు. ఆయన నిర్మించిన “కోర్ట్” ఇప్పటికే హిట్‌గా నిలిచింది. ఇప్పుడు తన స్నేహితురాలు ప్రసాంతి తో కలిసి నిర్మించిన “హిట్ 3” కూడా రిలీజ్‌కంటే ముందే భారీ లాభాల్లో ఉంది.
హిట్ 3 సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. క్రైమ్ థ్రిల్లర్ జానర్‌కు పీక్కొట్టేలా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. థియేట్రికల్ హక్కులు కూడా మంచి ధరలకు అమ్ముడయ్యాయి. కానీ అసలైన మ్యాజిక్ నాన్-థియేట్రికల్ బిజినెస్ లో జరిగింది.
సినిమా బడ్జెట్ మొత్తం రూ.80 కోట్లు (నాని రెమ్యూనరేషన్‌తో కలిపి) కాగా, నాన్-థియేట్రికల్ హక్కులతో ఒక్కసారిగా రూ.100 కోట్ల మార్క్‌ను దాటేసింది. అంటే సినిమా రిలీజ్ కాకముందే లాభాల్లోకి వెళ్లిపోయినట్టే. థియేట్రికల్ లాభాలు అన్నీ బోనస్ అనేలా తయారైంది. ఇది నిర్మాతగా నానికి పెద్ద సక్సెస్ అన్న మాట.
ఇక సినిమా విషయానికి వస్తే.. సైలేష్ కొలను దర్శకత్వం వహించిన “హిట్ 3”లో నాని పవర్‌ఫుల్ పోలీస్ పాత్రలో కనిపించనున్నాడు. ముందు రెండు పార్ట్స్‌కి కన్నా మాసివ్‌గా, డార్క్‌గా ఉంటుంది అన్న టాక్ ఇప్పటికే ట్రైలర్‌తో వచ్చింది. వాల్ పోస్టర్ సినిమాస్ బ్యానర్‌పై ఈ సినిమా నిర్మితమవుతోంది.
ఇంతలో ఇంత పెద్ద ప్రాఫిట్ రావడంతో, నాని మార్కెట్‌కి ఇది పెద్ద బూస్ట్ అవుతుంది. ఇదే జోరుతో “హిట్ యూనివర్స్” ఇంకా ఎన్ని సినిమాలు తీస్తారో చూడాలి!













