Homeతెలుగు Newsగ్రామీణ అభివృద్ధి ప్రణాళికలే లక్ష్యంగా టీడీపీ మేనిఫెస్టో: లోకేశ్‌

గ్రామీణ అభివృద్ధి ప్రణాళికలే లక్ష్యంగా టీడీపీ మేనిఫెస్టో: లోకేశ్‌

6 21
గ్రామీణ స్థాయి అభివృద్ధి ప్రణాళికలే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేనిఫెస్టో ఉంటుందని రాష్ట్ర పంచాయితీ రాజ్ శాఖ మంత్రి నారా లోకేశ్‌ స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిపైనే తమ పార్టీ దృష్టిసారించి అందుకు అనుకుణంగా అభివృద్ధి ప్రణాళికలు రచిస్తుందని వెల్లడించారు. విజయవాడ గేట్ వే హోటల్ లో నిర్వహించిన గ్రామస్థాయిలో సుస్థిరాభివృద్ధి లక్ష్యాల అమలు అంశంపై నిర్వహించిన సదస్సుకు హాజరైన ఆయన.. 11 స్టార్ల విధానాన్ని గ్రామాభివృద్ధి కోసం అనుసరిస్తున్నామని తెలిపారు. గ్రామాల అభివృద్ధిని అధ్యయనం చేసేందుకు 40 రకాల ప్రామాణికాలను అంచనా వేస్తున్నామని.. జియోట్యాగింగ్ ద్వారా అభివృద్ధి ప్రణాళికలను సిద్ధం చేస్తామని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో సురక్షితమైన తాగునీరు, పరిసరాలు, కుటుంబ ఆరోగ్యం, ఆదాయం తదితర అంశాలపై తమ ప్రభుత్వం దృష్టి పెట్టిందని, ఐక్యరాజ్య సమితి నిర్దేశించిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించటంలో ఏపీ అగ్రస్థానంలో ఉంటుందని ఆయన వెల్లడించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu