HomeTelugu Trendingనన్ను నటుడిగా స్వీకరించినందుకు ధన్యవాదాలు: అల్లరి నరేష్‌

నన్ను నటుడిగా స్వీకరించినందుకు ధన్యవాదాలు: అల్లరి నరేష్‌

3 10‘చూడటానికి అంతగా బాగోకపోయినా నన్ను నటుడిగా స్వీకరించినందుకు ధన్యవాదాలు’ అంటున్నారు సినీ నటుడు ‘అల్లరి’ నరేష్‌‌. ఈ మధ్యకాలంలో నరేష్‌ నటించిన సినిమాలు అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. అలాంటి సమయంలో ఆయన ‘మహర్షి’ సినిమాతో మళ్లీ ప్రేక్షకుల మనసును దోచుకున్నారు. గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘మహర్షి’ చిత్రం మంచి టాక్‌ అందుకుంటోంది. ఈ చిత్రంలో మహేష్‌ బాబు, పూజా హెగ్డే పాత్రలు ఒక ఎత్తైతే, అల్లరి నరేశ్‌ నటించిన రవి పాత్ర మరో ఎత్తు. ఎందుకంటే నరేష్‌ నటించిన తొలి చిత్రం ‘అల్లరి’లో కూడా ఆయన పాత్ర పేరు ‘రవి’ నే. ఈ నేపథ్యంలో నరేష్‌ సోషల్‌మీడియా వేదికగా ఓ పోస్ట్‌ పెట్టారు. తనను ఆదరించిన అభిమానులకు మనసారా కృతజ్ఞతలు చెప్పుకొన్నారు.

’17 ఏళ్ల క్రితం ఓ యువకుడు అందరిలాగే తన గమ్యాన్ని వెతుక్కుంటున్నాడు. చిత్ర పరిశ్రమలో నిలదొక్కుకోగలడో లేదో అన్న విషయం కూడా అతనికి తెలీదు. కానీ తన పట్టుబట్టి తన మనసు చెప్పిందే విన్నాడు. 2002 మే 10న ఆ యువకుడు ‘అల్లరి’ నరేష్‌ గా మరోసారి పుట్టాడు. ఆ చిత్రం ప్రేక్షకులు నన్ను స్వీకరించేలా చేసింది. అప్పట్లో అది చాలా అరుదు. చూడటానికి అంత అందంగా లేని నన్ను ప్రేక్షకులు ఆదరించినందుకు నేనెప్పుడూ రుణపడి ఉంటాను. ఇప్పుడు నేనెందుకు ఈ విషయాన్ని మీతో చెప్పుకొంటున్నాను? ఇండస్ట్రీలోకి వచ్చి 17 ఏళ్లు అయిన తర్వాత ఇలా ఎందుకు మాట్లాడుతున్నాను? అందుకు కారణం రవి (మహర్షిలో నరేశ్‌ పాత్ర పేరు). ‘అల్లరి’ సినిమాలో నా పేరు రవి.. ఇప్పుడు ‘మహర్షి’ లో నా పేరు కూడా అదే. ఈ 55 సినిమాల ప్రయాణం నా జీవితంలో ఎన్నో జ్ఞాపకాలను నింపింది. నన్ను ఇంతగా మెరుగుపరిచిన చిత్ర పరిశ్రమకు, నాపై నమ్మకం ఉంచిన నిర్మాతలు, దర్శకులు, టెక్నీషియన్లు, అభిమానులకు మీ నరేష్‌ హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకొంటున్నాడు’ అని పేర్కొన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!