HomeTelugu Newsబోయపాటి సినిమాలో నెగిటివ్‌ పాత్రలో యంగ్‌ హీరో..

బోయపాటి సినిమాలో నెగిటివ్‌ పాత్రలో యంగ్‌ హీరో..

6 15
టాలీవుడ్‌ లో ‘అందాలరాక్షసి’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు నవీన్ చంద్ర. ఆ తర్వాత కొన్ని సినిమాలలో హీరోగా నటించినా, మరికొన్ని సినిమాలలో స్పెషల్ క్యారెక్టర్లు కూడా పోషించాడు. ఇప్పుడు అదే కోవలో బోయపాటి శ్రీను నుంచి ఆఫర్ వచ్చిందట. వెంటనే ఆయన ఒప్పుకున్నట్లు తెలుస్తుంది. నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి రూపొందిస్తున్న భారీ చిత్రంలో ఓ నెగటివ్ టచ్ తో సాగే పాత్ర కోసం నవీన్ ను అడిగినట్లు తెలుస్తుంది. అయితే ఇప్పటికే ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్‌ లాక్‌డౌన్‌ కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే.

Recent Articles English

Gallery

Recent Articles Telugu