బాలయ్య కోసం నయన్ వచ్చింది!

నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రై. లిమిటెడ్‌ పతాకంపై కె.ఎస్‌.రవికుమార్‌ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్‌ ఓ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల ఘనంగా ప్రారంభోత్సవం జరుపుకొన్న ఈ చిత్రంలో నయనతారను కథానాయికగా ఎంపిక చేసిన విషయం తెలిసిందే. నేటి నుండి ఆమె ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ లో పాల్గొంటుంది. మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రం రెగ్యులర్ షెడ్యూల్ ప్రస్తుతం హైద్రాబాద్ లోని రామోజీ ఫిలిమ్ సిటీలో జరుగుతోంది.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత సి.కళ్యాణ్‌ మాట్లాడుతూ.. ”సింహా, శ్రీరామరాజ్యం లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ అనంతరం బాలకృష్ణ-నయనతార కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఇది. ఆ సినిమాల స్థాయిలోనే ఈ సినిమాలోనూ వారి మధ్య కెమిస్ట్రీ ఉండనుంది. బాలకృష్ణగారి కెరీర్‌లోనే ఇది మరో సంచలన చిత్రం అవుతుంది” అన్నారు.