రకుల్ ప్రీత్‌పై ఎన్‌సీబీ ప్రశ్నల వర్షం


డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నటి రకుల్ ప్రీత్ సింగ్ నిన్న నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఎదుట హాజరైన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇప్పటి వరకు రియా చక్రవర్తిని కస్టడీలోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బాలీవుడ్‌లోని పలువురికి ఎన్‌సీబీ నోటీసులు జారీ చేసింది. నోటీసులు అందుకున్న రకుల్ నిన్న ఎన్‌సీబీ విచారణకు హాజరైంది. ఎన్‌సీబీ అధికారులు సుమారు 4 గంటలపాటు రకుల్ ప్రీత్‌ సింగ్ పై ప్రశ్నల వర్షం కురిపించారు. రియాతో పరిచయం గురించి, సుశాంత్‌తో పార్టీలు, వాట్సప్‌ చాటింగ్‌ వంటి పలు అంశాలపై లోతుగా ప్రశ్నించినట్టు తెలుస్తోంది. రకుల్ పలు కీలక విషయాలు వెల్లడించినట్టు వార్తలు వస్తున్నాయి. తాను పార్టీకి వెళ్లిన మాట వాస్తవమే కానీ, డ్రగ్స్ తీసుకోలేదని, డ్రగ్స్ సరఫరాదారులతో తాను ఎప్పుడూ సంప్రదింపులు జరపలేదని రకుల్ చెప్పినట్టు తెలుస్తోంది. డ్రగ్స్‌తో సంబంధమున్న మరో నలుగురు బాలీవుడ్‌ ప్రముఖుల పేర్లు కూడా రకుల్‌ వెల్లడించినట్లు సమాచారం.

ఎన్‌సీబీ కార్యాలయంలో రకుల్ ప్రీత్ సింగ్

CLICK HERE!! For the aha Latest Updates