నా ఇష్టసఖి పుట్టిన రోజు శుభాకాంక్షలు: నిక్‌ జోనస్‌

హాలీవుడ్‌ స్టార్‌, ప్రియాంక చోప్రా భర్త నిక్‌ జోనస్‌.. ‘నా ఇష్టసఖి, నా జీవితానికి వెలుగు అయినటువంటి ప్రియాంకకు పుట్టిన రోజు శుభాకాంక్షలు’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశాడు. గ్లోబల్‌ స్టార్‌ ప్రియాంక చోప్రా గురువారం 38వ వసంతంలోకి అడుగు పెట్టారు. ఈ సందర్భంగా ఆమెకు అటు బాలీవుడ్‌ చిత్ర పరిశ్రమ నుంచి ఇటు అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. తన పుట్టినరోజు వేడుకలను భర్త నిక్‌ జోనస్, తల్లి మధు చోప్రా, సోదరి పరిణితి చోప్రాతో ఫ్లోరిడాలో సెలెబ్రేషన్స్‌ చేసుకుంది. ఈ క్రమంలో తన భర్త నిక్‌ జోనస్‌ ప్రియాంకకు శుభాకాంక్షలు తెలుపుతూ.. ఓ వీడియోను షేర్‌ చేశాడు. అంతేగాక జో జోనాస్, సోఫియా టర్నర్‌ వివాహంలో దిగిన ఫోటోను పోస్ట్‌ చేస్తూ ప్రత్యేక సందేశం రాశాడు. ఇందులో ప్రియాంక గులాబీ రంగు చీరలో మెరిసిపోతూ అభిమానులను ఆకర్షిస్తోంది.

కాగా జోనస్‌ కుటంబం నుంచి కూడా ప్రియాంకకు శుభాకాంక్షలు అందాయి. అటు నిక్‌ తల్లి డెనిస్‌ మిల్లర్‌ జోనస్‌ పూర్వం ప్రియాంకతో దిగిన ఫోటో షేర్‌ చేస్తూ.. అందమైన అమ్మాయికి అందమైన పుట్టిన రోజు శుభాకాంక్షలు అని తెలిపింది. నిక్‌ తండ్రి పాల్‌ కెవిన్‌ జోనస్ కోడలుగా తన కుటుంబంలోకి ప్రియాంక అడుగు పెట్టడం చాలా సంతోషమని, నీ రాకతో నిక్‌తో పాటు కుటుంబమంతా ఆనందంలో మునిగిపోయిందంటూ ప్రశంసించాడు. ఇక మూడేళ్లుగా బాలీవుడ్‌కు సెలవిచ్చిన ప్రియాంక తాజగా ‘ద స్కై ఇజ్‌ పింక్‌’ సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వనుంది. ఈ సినిమా అక్టోబర్‌ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.