పబ్లిక్‌లో ప్రియాంక పరువుపోకుండా కాపాడిన నిక్‌.. వైరల్‌

బాలీవుడ్ హాట్ బ్యూటీ ప్రియాంకకు సంబంధించిన ఏ చిన్న వార్త అయినా సరే వైరల్ అయిపోతుంది. ఇటీవలే ఈ ముద్దుగుమ్మ పెళ్లి కూడా చేసుకుంది. పాప్ సింగర్ నిక్ జోనస్‌ను పెళ్లాడింది. దీంతో ఎక్కడా చూసినా ఇప్పుడు వీరిద్దరి న్యూసే హల్ చల్ చేస్తుంది. తాజాగా ప్రియాంక పరువు పోకుండా కాపాడాడు భర్త నిక్ జోనస్. తాజాగా ప్రియాంక.. తాను నటించిన ‘ఈజ్ నాట్ ఇట్ రొమాంటిక్’ అనే అమెరికన్ మూవీ ప్రీమియర్స్‌కు భర్తతో కలిసి వెళ్లింది. అయితే ఈ సందర్భంగా ప్రత్యేకంగా డిజైన్ చేసిన గౌనులో మెరిసిందీ హాట్ భామ. కారు దిగి నడుచుకుంటూ వెళ్తుండగా పొడవాటి గౌను ఆమె వేసుకున్న హైహీల్స్‌లో ఇరుక్కుంది. దీంతో ఒక్కసారిగా ప్రియాంక కిందపడినంత పనైంది. దీంతో వెంటనే పక్కనే ఉన్న భర్త నిక్ జోనస్ వెంటనే రియాక్ట్ అయ్యాడు. ఆమెను కిందపడిపోకుండా పట్టుకున్నాడు. దీంతో చిరునవ్వులు నవ్వకుంటూ భర్తను పట్టుకొని థియేటర్లోకి నడుచుకుంటూ వెళ్లిపోయింది ప్రియాంక.

అయితే ఈ సీన్ అంతా అక్కడున్న జనాలు తమ కెమెరాల్లో బంధించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ అయిన ప్రియాంక వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. ‘ఈజ్ నాట్ ఇట్ రొమాంటిక్’ సినిమా వివరాల్లోకి వెళితే.. ఇదొక రొమాంటిక్ సెటైరికల్ ఫాంటసీ ఫిల్మ్. రెబెల్ విల్సన్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ప్రియాంక ఇందులో ఇసబెల్లా అనే ఇండియన్ యోగా అంబాసిడర్ పాత్రలో నటించింది.