HomeTelugu Big Storiesఆర్ఆర్ఆర్ క్లైమాక్స్ కోసం హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్

ఆర్ఆర్ఆర్ క్లైమాక్స్ కోసం హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్

RRR update
దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్. భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్-ఒలీవియా మోరిస్, రామ్‌చరణ్-అలియా భట్ జంటలుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్‌చరణ్.. కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ దశలోనే సంచలనాలను క్రియేట్ చేస్తోంది. డిజిటల్ హక్కులు భారీ ధరకు అమ్ముడుపోయినట్లు వార్తలు వస్తున్నాయి. స్టార్ నెట్‌వర్క్‌ సంస్థ ఓటీటీ హక్కులను భారీగా ధరకు కొనుగోలు చేస్తుందన్న వార్త వైరల్‌ అవుతోంది.

RRR update1

ముందుగా థియేటర్లలో విడుదలైన తర్వాత నేరుగా ఓటీటీలో వస్తుందని అంటున్నారు. దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. ప్రస్తుతం ఆఖరి షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.అయితే ఈ సినిమా సెట్‌లో ప్రముఖ హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్ నిక్ పావెల్‌ రాజమౌళితో కలిసి వున్న ఫొటోను చిత్రబృందం ట్విట్టర్‌లో షేర్ చేసింది. గ్లాడియేటర్, ది బోర్న్ ఐడెంటిటీ, ఎక్స్-మెన్: ది లాస్ట్ స్టాండ్ వంటి సినిమాలకు నిక్ పోవెల్ వర్క్ చేశారు. నిక్‌ పావెల్‌
కత్తియుద్ధంలో నిపుణుడు. ఆర్ఆర్ఆర్ మూవీ క్లైమాక్స్‌లో కత్తి యుద్ధాలు ఉండబోతున్నట్లు తెలుస్తోంది. నిక్‌ పావెల్‌తో కలిసి క్లైమాక్స్ మరింత అద్భుతంగా ప్లాన్ చేసినట్లున్నాడు జక్కన్న.

Recent Articles English

Gallery

Recent Articles Telugu