ఆసక్తికరంగా నితిన్‌ ‘మాస్ట్రో’ ఫస్ట్‌ గ్లిమ్స్‌.. ‌

టాలీవుడ్‌ యంగ్‌ హీరో నితిన్- దర్శకుడు మేర్లపాక గాంధీ కాంబినేషన్‌ లో తెరకెక్కిస్తున్న చిత్రం ”మాస్ట్రో”. ఇది హిందీ సూపర్ హిట్ మూవీ ‘అంధాదున్’ తెలుగు రీమేక్. నేడు నితిన్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్ ని ప్రకటించడంతో పాటుగా ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేశారు. ఈ నేపథ్యంలో స్పెషల్ గా ఓ గ్లిమ్స్ ని ‘మాస్ట్రో’ చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ వీడియోలో నితిన్ అంధుడైన ఓ వాద్య కళాకారుడిగా పియానో ప్లే చేస్తూ కనిపిస్తున్నాడు. అదే సమయంలో ఓ పిల్లి పియానో పై కాలు పెట్టగా.. నితిన్ ఓ వాటర్ టబ్ లో తల పెట్టి భయభయంగా కళ్ళు తెరిచి చూస్తున్నాడు. దీనికి మణిశర్మ తనయుడు మహతి స్వర సాగర్ అందించిన నేపథ్య సంగీతం.. జె.యువరాజ్ విజువల్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి.

ఈ గ్లిమ్స్ తోనే ‘మాస్ట్రో’ సినిమాపై ఆసక్తిని కలిగించే విదంగా ఉన్నాయి. రాజ్ కుమార్ ఆకెళ్ల సమర్పణలో శ్రేష్ఠ మూవీస్ బ్యానర్ పై ఎన్.సుధాకర్ రెడ్డి – నికిత రెడ్డిలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం మిల్కీబ్యూటీ తమన్నా భాటియా కీలక పాత్ర పోషిస్తోంది. నభా నటేశ్ హీరోయిన్ గా నటిస్తోంది. నితిన్‌ 30వ సినిమాగా తెరకెక్కతున్న ఈ చిత్రం జూన్ 11న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

CLICK HERE!! For the aha Latest Updates