HomeTelugu Trendingఓటీటీలో నితిన్‌ 'మాస్ట్రో'

ఓటీటీలో నితిన్‌ ‘మాస్ట్రో’

Nithin maestro streaming in

హీరో నితిన్‌ తాజా చిత్రం మాస్ట్రో. ఇందులో తమన్నా కీలక పాత్ర చేస్తుండగా నభానటేశ్ హీరోయిన్‌గా నటిస్తోంది. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో క్రైమ్ అండ్ కామెడీ థ్రిల్లర్‌గా రూపొందుతోంది. నితిన్ కెరీర్‌లో 30వ చిత్రం మాస్ట్రో సెప్టెంబర్ 13 నుంచి ప్రముఖ ఓటీటీ డిస్నీ+ హాట్‌స్టార్‌ వేదికగా స్ట్రీమింగ్‌ కానుంది. శ్రేష్ఠ్‌ మూవీస్‌ పతాకంపై సుధాకర్‌రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మించారు. ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమా అంచనాలను మరింత పెంచింది. ‘కళ్లు కనపడకపోతే ఉండే ఇబ్బందులు అందరికీ తెలుసు’ అంటూ నితిన్ చెప్పే డైలాగ్‌తో ప్రారంభమైన ఈ ట్రైలర్‌ ఆద్యంతం అలరించింది. అంధుడిగా నితిన్‌ నటన మెప్పిస్తోంది. హిందీలో విజయవంతమైన ‘అంధాధున్‌’ సినిమాకు రీమేక్‌గా రూపొందింది. ఈ చిత్రంలో సీనియర్ నటుడు నరేష్, జిషుసేన్ గుప్తా, శ్రీముఖి, అనన్య, హర్షవర్ధన్, రచ్చ రవి, మంగ్లీ, శ్రీనివాస్ రెడ్డి తదితరులు నటిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!