‘సాహో’ రికార్డ్!

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ బహుబలి తరువాత నటిస్తున్న చిత్రం ‘సాహో’. ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా సాహో సినిమాకు సంబంధించి యాక్షన్ మేకింగ్ వీడియో చాప్టర్-1 ను రిలీజ్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో రిలీజైన 24 గంటల్లోనే అనేక రికార్డులు సొంతం చేసుకున్నది.

యూట్యూబ్ తో సహా సోషల్ మీడియాలో కలుపుకొని 52 మిలియన్ వ్యూస్ ను సాధించింది. ఇండియన్ సినిమా చరిత్రలో ఓ రికార్డ్. ఇంతవరకు ఏ సినిమా వీడియో తక్కువ టైమ్ లో ఇన్ని వ్యూస్ ను సొంతం చేసుకోలేదు. చిన్న వీడియోనే ఇన్ని రికార్డులను సృష్టిస్తే.. ఇక సినిమా ఎన్ని రికార్డులు సృష్టిస్తుందో మరి. యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ స్పెషల్ గా రిలీజ్ కానున్నది.