రెండు భాగాలుగా ‘ఎన్టీఆర్‌’!

ప్రముఖ నటుడు బాలకృష్ణ ప్రధాన పాత్రలో దర్శకుడు క్రిష్ నందమూరి తారకరామారావు బయోపిక్ ను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. మొదట ఈ సినిమాను ఒక భాగంలోనే తీయాలని అనుకున్నారు. కానీ ఇప్పుడు ఎన్టీఆర్ జీవితాన్ని ఇలా కేవలం రెండున్నర గంటల్లో చూపిస్తే ప్రేక్షకులు సినిమాను ఊరికే చుట్టేశారనుకునే ప్రమాదం ఉందని ఆలోచిస్తున్నారట.

అందుకే సినిమాను రెండు భాగాలుగా విడగొట్టి మొదటి భాగాన్ని సంక్రాంతికి విడుదలచేసి రెండు నెలల తరవాత రెండవ భాగాన్ని విడుదలచేయాలని ఆలోచనలో ఉన్నారట. అయితే ఈ విషయాన్ని ఇంక అధికారంగా ప్రకటించలేదు. ఈ చిత్రంలో పలు కీలక పాత్రల్లో విద్యాబాలన్‌, సుమంత్‌, విజయ్‌ సేతుపతి, తదితరులు నటిస్తున్నారు.