ఎన్టీఆర్ బర్త్ డే గిఫ్ట్ ఏంటో తెలుసా..?

హీరోల పుట్టినరోజులను ఘనంగా ఏర్పాటు చేసే అభిమానులకు వారు కూడా స్పెషల్ గిఫ్ట్స్ ఇవ్వాలని ప్లాన్ చేస్తుంటారు. ఎన్టీఆర్ కు తన పుట్టినరోజుకి అభిమానులకు కానుక ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు. టైటిల్ లోగో డిజైన్ తో ఇప్పటికే ‘జై లవకుశ’ ప్రేక్షకులను ఆకట్టుకుంది. సినిమాలో పాత్రలతో పాటు కథను ఎలివేట్ చేసే విధంగా టైటిల్ డిజైన్ చేశారు. ఇప్పుడు సినిమా ఫస్ట్ లుక్ రాబోతుంది. ఈ నెల 20న ఎన్టీఆర్ పుట్టినరోజు సంధర్భాన్ని పురస్కరించుకొని ఒకరోజు ముందుగానే ఫ్యాన్స్ కు ఫస్ట్ లుక్ తో ట్రీట్ ఇవ్వడానికి చిత్రబృందం రెడీ అయింది.

సినిమా ఫస్ట్ లుక్ ఓ రేంజ్ లో ఉంటుందని చెబుతున్నారు. సినిమాలో ఎన్టీఆర్ చేస్తోన్న మూడు గెటప్స్ ను మిక్స్ చేస్తూ.. ప్రత్యేకంగా ఫస్ట్ లుక్ ను డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. ఇదే గనుక నిజమైతే ఇక అభిమానులకు పండగే. ఈ సినిమాలో మొదటిసారిగా ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తోన్న సంగతి తెలిసిందే. నివేదా థామస్, రాశిఖన్నాలు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. వారితో పాటు నందిత కూడా ఓ చిన్న పాత్రలో మెరవనుంది.