HomeTelugu Big Storiesభారత్‌లో.. 2902 కరోనా కేసులు, 68 మరణాలు

భారత్‌లో.. 2902 కరోనా కేసులు, 68 మరణాలు

2 3

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తుంది. ఈ వైరస్‌ తీవ్రత భారత్‌లో కూడా రోజురోజుకు పెరుగుపోతుంది. శనివారం ఉదయానికి దేశంలో కరోనా బాధితుల సంఖ్య 2902కి చేరిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. వీరిలో 68మంది మరణించగా 2650మంది ప్రస్తుతం చికిత్స పొందుతున్నారని ప్రకటించింది. మరో 184మంది కొవిడ్‌-19 నుంచి కోలుకున్నట్లు తెలిపింది.

దేశంలో అత్యధికంగా కొవిడ్‌-19 తీవ్రత మహారాష్ట్రలో కొనసాగుతోంది. తాజాగా ఇక్కడ మృతుల సంఖ్య 19కు చేరగా మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 423గా ఉంది. గుజరాత్‌లో ఈ వైరస్‌తో మరణించిన వారిసంఖ్య 9కి చేరింది. ఢిల్లీ, మధ్యప్రదేశ్‌లలో కొవిడ్‌-19 మృతుల సంఖ్య 6కు చేరింది. ఢిల్లీలో బాధితుల సంఖ్య 386కు చేరగా ఇది మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వం అంచనా వేస్తోంది. పంజాబ్‌లో 53కేసులు నమోదుకాగా ఐదుగురు మరణించారు. తమిళనాడులో వైరస్‌ అత్యంతవేగంగా వ్యాపిస్తోంది. రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 411కు చేరింది. మహారాష్ట్ర తరువాత అత్యధిక కేసులో తమిళనాడులోనే నమోదయ్యాయి. కర్ణాటక, పశ్చిమబెంగాల్‌లో ముగ్గురు చొప్పున మరణించారు. జమ్మూ కశ్మీర్‌లో కొవిడ్‌19 కారణంగా ఇద్దరు మరణించారు. కేరళలో కొవిడ్‌ తీవ్రత కొనసాగుతోంది. ఇప్పటికే ఇక్కడ 295కి పైగా పాజిటివ్‌ కేసులు నమోదుకాగా ఇద్దరు మరణించారు. ఉత్తర్‌ప్రదేశలో లో 174కేసులు నమోదు కాగా ఇద్దరు మరణించారు. ఆంధ్రప్రదేశ్‌, బిహార్‌, హిమాచల్‌ప్రదేశ్‌, తమిళనాడులో ఒకరుచొప్పున మరణించారని ప్రభుత్వం వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల్లో వైరస్‌ తీవ్రత పెరింగింది. తెలంగాణలో 229మంది వైరస్‌ బారినపడగా 11మంది మరణించిట్లు రాష్ట్రప్రభుత్వం వెల్లడించింది. ఇప్పటి వరకు ఏపీలో కరోనా బాధితుల సంఖ్య 180కి చేరింది, ఒకరు మృతిచెందారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu