మాతృదినోత్సవం సందర్భంగా అనసూయ ‘కథనం’ తొలి పాట

ప్రముఖ యాంకర్‌, నటి అనసూయ భరద్వాజ్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ‘కథనం’. ఈ చిత్రానికి రాజేశ్‌ నాదెండ్ల దర్శకత్వం వహిస్తున్నారు. ఈరోజు మాతృదినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ చిత్రంలోని తొలి పాట లిరికల్‌ వీడియోను అనసూయ ట్విటర్‌ వేదికగా విడుదల చేశారు. ‘చీకటి కొండల్లోనా తూర్పు నువ్వేనమ్మా.. గుడిసె గుండెల్లోనా మెరుపు నువ్వేనమ్మా.. పిలవగానే పలుకుతావే మాకోసమొచ్చిన దేవత’ అంటూ సాగుతున్న ఈ పాట ఎంతో వినసొంపుగా ఉంది. రోషన్‌ సాలూరు ఈ సినిమాకు సంగీతం అందించారు. ఈ పాటను కాల భైరవ ఆలపించారు. అవసరాల శ్రీనివాస్‌, ధన్‌రాజ్‌, వెన్నెల కిశోర్‌ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. త్వరలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

CLICK HERE!! For the aha Latest Updates