గాలి సంపత్‌ ట్రైలర్‌

టాలీవుడ్‌ యంగ్ హీరో శ్రీ విష్ణు నటిస్తున్న చిత్రం ‘గాలి సంప‌త్’. ల‌వ్‌లీ సింగ్ హీరోయిన్‌ న‌టించింది. అనిష్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రాజేంద్ర‌ప్ర‌సాద్ టైటిల్ పాత్రలో నటిస్తున్నారు. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ చిత్రానికి స‌మ‌ర్పకుడిగా వ్యవ‌హ‌రించడంతో పాటు స్క్రీన్‌ప్లే, ద‌ర్శక‌త్వ ప‌ర్యవేక్షణ కూడా చేస్తున్నాడు. అనిల్ కో-డైరెక్టర్, రైట‌ర్, మిత్రుడు ఎస్.క్రిష్ణ నిర్మాత‌గా ఇమేజ్ స్పార్క్‌ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌ను స్థాపించి షైన్ స్క్రీన్స్‌తో క‌లిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. దర్శకదీరుడు ఎస్ఎస్ రాజమౌళి ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు. శ్రీ విష్ణు, రాజేంద్ర ప్రసాద్ నటన ట్రైలర్ లో హైలైట్ గా నిలిచింది. మార్చి 11న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

CLICK HERE!! For the aha Latest Updates