Homeతెలుగు Newsఅరెరే... 'పుష్ప 2' పరిస్థితి కూడా అంతేగా !

అరెరే… ‘పుష్ప 2’ పరిస్థితి కూడా అంతేగా !

pushpa 2

కొద్ది రోజుల క్రితమే అల్లు అర్జున్ – సుకుమార్ పుష్ప 2 సినిమా షూట్ స్టార్ట్ అయింది. ఇప్పటికే ఈ ప్రాజెక్టు మీద చాలా గ్యాసిప్ లు పుట్టాయి. కానీ, వాటన్నింటికి ఫుల్ స్టాప్ పెడుతూ ఎప్పటికప్పుడు దర్శకుడు సుకుమార్ టీమ్ క్లారిటీ ఇస్తూనే వచ్చింది. ఐతే, ఇప్పుడు ఇండస్ట్రీలో కొత్త డిస్కషన్ పాయింట్ వచ్చి చేరింది. ఈ సినిమా కోసం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తీసుకున్న రెమ్యునరేషన్ ఎంత ?, నిజానికి అల్లు అర్జున్ రెమ్యూనరేషన్ ఇంత.. అంత అంటూ రకరకాల ఫిగర్లు ఇప్పటికే వైరల్ అయ్యాయి. కానీ, వాటిల్లో వాస్తవం ఎంత ఉంది అని ఇప్పటి వరకు అధికారిక ప్రకటన లేదు.

మరోపక్క, తన తోటి స్టార్స్ పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్.. ఇలా అందరూ 60 కోట్లు నుంచి 75 కోట్ల రెమ్యూనరేషన్ మార్క్ ను టచ్ చేశారు. మరి ఈ లెక్కన అల్లు అర్జున్ రెమ్యూనరేషన్ మార్క్ ఎంత ఉంటుంది ?, మిగిలిన స్టార్ లు కంటే ఒక మెట్టు ఎక్కువనుకునే అల్లు అర్జున్ కూడా అంతకన్నా ఎక్కువే తీసుకుంటాడు. ఇంతకీ అల్లు అర్జున్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా ?, 60 కోట్లు అని పక్కాగా వినిపిస్తోంది. కాదు, 65 కోట్లు పైగానే అని కూడా టాక్ వినిపిస్తోంది. అసలు ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించి అల్లు అర్జున్ రెమ్యూనరేషన్ ఇంత అని ఏ ఫిగర్ బయటకు రాలేదు.

ఐతే, గతంలో అల్లు అర్జున్ రెమ్యూనరేషన్ 35 కోట్లు నుంచి 45 కోట్లు మధ్యలో ఉండేది. కానీ, ప్రస్తుతం సుకుమార్ తో చేస్తున్న పుష్ప 2 సినిమా నేషనల్ రేంజ్ సినిమా. పైగా పుష్ప సినిమా నార్త్ లో బాగా చేసింది. ఈ లెక్కన అల్లు అర్జున్ రెమ్యునరేషన్ కచ్చితంగా ఎక్కువ ఉంటుందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ ‘పుష్ప 2’ కోసం 70 కోట్ల కి కాస్త ఇటు అటుగా కోట్ చేసి తీసుకున్నాడని అంటున్నారు. ఇప్పుడు ఎలాగూ స్టార్ హీరోల రెమ్యూనిరేషన్లు బాగా పెరిగాయి. అందువల్ల అల్లు అర్జున్ రెమ్యూనరేషన్ కూడా ఈజీగా 70 కోట్లు పైమాటే ఉంటుంది అంటున్నారు.

ఒకవేళ ఇదే నిజం అయితే, ఇంతకీ అల్లు అర్జున్- సుకుమార్ పుష్ప 2 సినిమా బడ్జెట్ ఎంత ?, అల్లు అర్జున్ కే 70 కోట్లు ఇచ్చి, సుకుమార్ కు మరో 30 కోట్లు ఇచ్చి.. ఇవి కాకుండా మిగిలిన నటీనటులకు మరియు సాంకేతిక బృందానికి అలాగే ప్రొడక్షన్ కి… ఇవన్నీ కలుపుకుంటే.. మరో 140 నుంచి 150 కోట్లు దాటేస్తాయి. అంటే టోటల్ ప్రొడక్షన్ కాస్ట్ నే 250 కోట్లు దాటేలా ఉంది. మరి ఈ రేంజ్ బడ్జెట్ పెడితే.. అసలు పుష్ప 2 సినిమా వర్కౌట్ అవుతుందా ?, అసలుకే పాన్ ఇండియా హిట్ అంటూ డప్పులు కొట్టుకున్న పుష్ప మొదటి భాగమే తెలుగులో బ్రేక్ ఈవెన్ కాలేదు. మరీ పుష్ప 2 పరిస్థితి అంతేగా !!

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

రావణాసుర టీజర్‌: రవితేజ హీరో నా.. విలన్‌నా!

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu