బాలకృష్ణ తెలియదు అనడం పొరపాటే.. ఆయనో పెద్ద కమెడియన్.. నాగబాబు మరో హాట్ కామెంట్‌

మెగా బ్రదర్ నాగబాబు.. నందమూరి బాలకృష్ణ ఎవరో తనకు తెలియదంటూ హాట్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి బాలయ్యని టార్గెట్‌ చేస్తూ.. సంచలన కామెంట్స్ చేశారు నాగాబాబు. ‘బాలయ్య ఎవరో తెలియదనడం వల్ల చాలా మంది ఫీల్ అవుతున్నారని నాకు తెలిసింది. అలా అనడం తప్పే.. అయినా బాలయ్య తెలియని వాళ్లు ఉంటారా? ఆయనో పెద్ద కమెడియన్’ అంటూ బాంబ్ పేల్చారు నాగబాబు.

ఆయన మాట్లాడుతూ.. ‘నిన్న నా ఫేస్ బుక్‌ లైవ్‌లో తప్పిదం జరిగింది. నేను టీవీలు, యూట్యూబ్‌లు పెద్దగా చూడను. నిన్న నా ఫేస్ బుక్ లైవ్‌లో కొంతమంది బాలకృష్ణ గురించి మాట్లాడమంటే తెలియదని పొరపాటుగా అనేశాను. దానివల్ల చాలామంది ఫీల్ అయ్యారని నాకు ఫీడ్ బ్యాక్ వచ్చింది. అలా అనడం తప్పుకదా.. మీకు బాలకృష్ణ తెలియదా అని నా ఫ్రెండ్, తెలిసిన వాళ్లు అన్నారు. నిజంగా బాలకృష్ణ గారు తెలియదు అనడం నా పొరపాటే. ఎందుకంటే బాలకృష్ణ తెలియని వాళ్లు ఎవరు ఉంటారు చెప్పండి.

ఆయన అందరికీ తెలుసు. మంచి నటుడు. ముఖ్యంగా పెద్ద కమెడియన్. ఆయనంత కామెడీ చేసే వాళ్లు అరుదుగా ఉంటారు. ఆయన హాస్యంతో కడుపుబ్బా నవ్విస్తారు. అలాంటి హాస్య నటులు తెలియదు అనడం తప్పే. పైగా ఆయన ఎన్టీఆర్ లాంటి హీరోలతో నటించిన కమెడియన్’ అంటూ వల్లూరి బాలకృష్ణ ఫొటోని చూపించి పెద్ద ట్విస్ట్ ఇచ్చారు నాగబాబు.

ఈ వల్లూరి బాలకృష్ణకి నిక్ నేమ్ కూడా ఉంది. అంజిగాడు. ఈయన కృష్ణగారు అసాధ్యుడు చిత్రంలో నటించారు. ప్రముఖ సినీ హాస్య నటుడు వల్లూరి బాలకృష్ణ అని వికీపీడియాలో కొడితే వస్తుంది. విషాదకరమైన వార్త ఏంటంటే ఆయన ఇప్పుడు మన మధ్య లేరు. చాలా కాలం అయ్యింది ఆయన మరణించి. ఆయన మరణించినా కూడా హాస్యాన్ని పంచుతూనే ఉన్నారు. అలాంటి ఆయన్ని మరిచిపోవడం అనేది నేను చేసిన పెద్ద మిస్టేక్ అది నేను ఈ వీడియో ద్వారా సరిచేసుకున్నాను’ అంటూ నాగబాబుని ట్రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ అభిమానులుకు, టీడీపీ శ్రేణులకు వ్యంగంగా సమాధానం చెప్పారు నాగబాబు.

CLICK HERE!! For the aha Latest Updates