బిగ్‌బాస్‌ న్యూ ప్రోమో.. వైరల్‌

‘బిగ్‌బాస్‌’ మూడో సీజన్‌ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదరుచూస్తున్నారు. ఇటీవలె స్టార్‌ మా బృందం త్వరలోనే మూడో సీజన్‌ మొదలుకానుందని ప్రకటించింది. తాజాగా ఓ ప్రోమోను కూడా విడుదలచేశారు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్‌ మీడియాలో తెగ హల్‌చల్‌ చేస్తోంది. ఇప్పటికే మూడో సీజన్‌ హోస్ట్‌గా కింగ్‌ నాగార్జున వ్యవహరించబోతున్న విషయం తెలిసిందే. డిఫరెంట్‌గా డిజైన్‌ చేసిన ఈ ప్రోమో నెటిజన్లను ఆకర్షిస్తోంది.

ఓ స్వామిజీ ఉపదేశం ఇస్తున్నట్లుగా బిగ్‌బాస్‌ హౌస్‌ గురించి వివరిస్తూ.. ‘మనసు కోతిలాంటిది మరి అలాంటి మనసున్న మనుషులు, ఓ ఇంట్లో చేరితే.. మమకారంతో వెటకారంతో ఏకతాటిపైకి తెచ్చేదెవరు? అధికారంతో నడిపేది ఎవరు? ఆ ఇంట్లో కొత్త ఉత్సాహాన్ని నింపే శక్తి గల వ్యక్తి ఎవరు?’ అని అంటుంటే.. అక్కడ ఆయన ముందు కూర్చున్న వారికే కాదు ప్రోమో చూస్తున్నవారికి కూడా ఆసక్తి కలిగించేలా క్రియేట్‌ చేశారు. ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్‌ అవుతోంది. ఇక ఈ మూడో సీజన్‌ మరింత రసవత్తరంగా ఉండబోతోందని, అయితే సామాన్యుడికి ఈ సారి ఎంట్రీ లేదని తెలుస్తోంది. అయితే ఇప్పటికే వరకు కంటెస్టెంట్ల వివరాలు అధికారికంగా బయటకు రాకపోవడంతో.. ఇప్పటికీ ఊహాగానాలతో ఎవరికి వారు ఓ లిస్ట్‌ను తయారు చేసి సోషల్‌ మీడియాలో వదులుతున్నారు. త్వరలోనే కంటెస్టెంట్ల వివరాలు ప్రకటించనున్నట్లు సమాచారం. జూలైలో బిగ్‌బాస్‌ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.