మరోసారి ఆ శర్వాతో సాయి పల్లవి!


టాలీవుడ్‌లో శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో వచ్చిన ‘ఫిదా’ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది సాయి పల్లవి. మలయాళం హీరోయిన్ అయినప్పటికీ అచ్చం తెలుగింటి అమ్మాయిలా ఉండే పల్లవి ఇక్కడ వరుస ఆఫర్లు అందుకుంటుంది. అటు మలయాళం ,తమిళ్ తోపాటు తెలుగులోనూ హీరోయిన్ గా సత్తా చాటుతుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ శేఖర్ కమ్ముల దర్శకత్వంలోనాగచైతన్య నటిస్తున్న”లవ్ స్టోరీ” సినిమా చేస్తుంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది .ఇటీవల విడుదలైన ఏ పిల్లా అనే ప్రోమో ప్రేక్షకులను ఆకట్టుకుంది.

కాగా తాజాగా సమాచారం ప్రకారం సాయి పల్లవి శర్వానంద్ తో కలిసి నటించనుందట. గతం లో ఈ ఇద్దరు కలిసి ‘పడి పడి లేచే మనసు’ అనే సినిమాలో నటించారు. ఈ సినిమా అనుకున్నంత విజయం సాధించాక పోయిన శర్వానంద్ సాయి పల్లవి కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ‘నేను శైలజ’, ‘ఉన్నది ఒకటే జిందగీ’, ‘చిత్రలహరి’ వంటి సినిమాలతో సక్సెస్ లు అందుకున్న కిషోర్ తిరుమల దర్శకత్వంలో శర్వానంద్ నటించనున్నాడు. సమ్మర్ తర్వాత ఈ సినిమా షూటింగ్ మొదలుకానుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా సాయి పల్లవి ని సంప్రదిస్తున్నారట. కాగా తిరుమల కిషోర్ ప్రస్తుతం రామ్ తో రెడ్ అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు.