
OTT Actor surprises with remuneration:
ఐదేళ్ల తర్వాత ‘పాతాళ్ లోక్ 2’ అమెజాన్ ప్రైమ్ వీడియోలో రీటర్న్ అయింది. సీజన్ 1లో ప్రజలను అలరించిన ఈ క్రైమ్ డ్రామా, ఇప్పుడు సీజన్ 2తో ప్రేక్షకుల మనసులను దోచుకుంటోంది. ఈ సిరీస్‌లో జైదీప్ అహ్లావత్ మరోసారి హతిరామ్ చౌదరి పాత్రలో మెరిశారు. ఈసారి ఆయన ఒక హై ప్రొఫైల్ హత్య కేసును పరిశోధించేందుకు మిస్టీరియస్ నార్త్ ఈస్ట్ ప్రాంతానికి వెళ్తారు. ఆయనకు సహకారిగా ఇష్వాక్ సింగ్ (అన్సారి) కీలక పాత్ర పోషించారు.
ఈ సీజన్‌లో కొత్త నటులు జహ్ను బరువా, తిలోత్తమా షోమ్, నాగేష్ కుకునూర్‌లను పరిచయం చేశారు. వీరి నటన ఈ సిరీస్‌ను మరింత ఆసక్తికరంగా మార్చింది. ప్రత్యేకంగా వీరి పాత్రలు కథను మరో స్థాయికి తీసుకెళ్లాయి.
‘పాతాళ్ లోక్’ సిరీస్ విజయంలో హతిరామ్ పాత్ర కీలక భూమిక పోషించింది. మొదటి సీజన్ కోసం జైదీప్ రూ. 40 లక్షలు తీసుకున్నారు. కానీ రెండో సీజన్‌కు ఏకంగా రూ. 20 కోట్ల పారితోషికం అందుకున్నారు. ఇది ఈ సిరీస్ విజయానికి ఆయన పాత్ర ఎంత ముఖ్యమో చెబుతోంది.
సోషల్ మీడియాలో జైదీప్ నటనకు విపరీతమైన ప్రశంసలు వస్తున్నాయి. అభిమానులు ఆయనను సిరీస్‌కు ప్రాణం అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.
ALSO READ: Chiranjeevi తో సినిమా గురించి క్రేజీ వార్త బయట పెట్టేసిన Anil Ravipudi!