
Chiranjeevi Anil Ravipudi Movie:
టాలీవుడ్‌లో దర్శకుడు అనిల్ రావిపూడి ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారారు. విక్టరీ వెంకటేశ్‌తో చేసిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం 2025 సంక్రాంతి విజేతగా నిలిచింది. ఈ సినిమాలో అనిల్ తన మార్క్ కామెడీ సన్నివేశాలు, వెంకటేశ్ ప్రత్యేకమైన మేనరిజంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సినిమా విజయం దిశగా ముందుకు సాగుతుండటంతో అనిల్ రావిపూడి పేరు సినీ వర్గాల్లో మారుమోగుతోంది.
ఈ నేపథ్యంలో ఆయన చిరంజీవితో చేసే తదుపరి ప్రాజెక్ట్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల మీడియాతో మాట్లాడిన అనిల్ రావిపూడి చిరంజీవి అభిమానులకు మేజర్ సర్‌ప్రైజ్ ఇచ్చారు. వెంకటేశ్ మెలోడియస్ పాటలకు స్టెప్పులు పెట్టి ప్రేక్షకులను ఆకట్టుకున్నట్లు, చిరంజీవి కూడా తన సినిమాలో అలాంటి పాటలకు డాన్స్ చేస్తారని హామీ ఇచ్చారు.
“సంక్రాంతికి వస్తున్నాం’లో మెలోడియస్ ఆల్బమ్ హైలైట్ అయ్యింది. ప్రేక్షకులు ఆ పాటలతో ఆడియన్స్ కనెక్ట్ అయ్యారు. ఇక చిరంజీవిగారు అలాంటి పాటలకు స్టెప్పులు వేస్తే ఏ రేంజ్‌లో ఉండబోతోందో ఊహించండి!” అని అన్నారు. అనిల్, చిరంజీవి డాన్స్ కి సెపరేట్ ఫ్యాన్ బెస్ ఉంది అనేది అందరికీ తెలిసిందే. ఆ అంశాన్ని ప్రాధాన్యతగా తీసుకుని చిరు అభిమానులను ఫిదా చేస్తామన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు.
ఈ ప్రకటనతో చిరంజీవి అభిమానుల్లో ఉత్సాహం మరింత పెరిగింది. ఇప్పటికే సినిమా ఎప్పుడు ప్రారంభమవుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులు, అనిల్ రావిపూడి మాటలతో మరింత ఉత్సాహంగా మారారు. ఈ ప్రాజెక్ట్‌పై ఇంకా మరిన్ని వివరాలు త్వరలో ప్రకటించబడతాయనేది సమాచారం.
ALSO READ: ఇండియాలో Highest Paid OTT actors జాబితాలోకి కొత్తగా చేరిన సెలబ్రిటీలు!