రివ్యూ: ఆక్సిజన్

movie-poster
Release Date
November 30, 2017

జోనర్: కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్
దర్శకత్వం: ఏ.ఎం.జ్యోతికృష్ణ
నిర్మాత: ఐశ్వర్య

కథ:
ఊరికి పెద్ద మనిషి అయిన రఘుపతి(జగపతిబాబు)ని అతడి కుటుంబ సభ్యులను చంపాలని అతడి శత్రువులు ప్రయత్నిస్తుంటారు. దీంతో తన కుటుంబాన్ని ఇల్లు దాటనివ్వడు. కూతురు శృతి(రాశిఖన్నా)ని కృష్ణప్రసాద్(గోపిచంద్) అనే ఎన్నారైకి ఇచ్చి పెళ్లి చేసి అమెరికా పంపించాలనుకుంటాడు రఘుపతి. ఊరి వదిలి వెళ్ళడం ఇష్టం లేని శృతి.. కృష్ణప్రసాద్ లో లోపాలు వెతికి ఆ మ్యాచ్ క్యాన్సిల్ చేయాలని చూస్తుంది. కానీ కృష్ణప్రసాద్ తన మంచితనంతో కుటుంబానికి దగ్గరవుతాడు. దీంతో పెళ్లి చేయాలని ముహూర్తం ఫిక్స్ చేస్తారు. ఈలోగా రఘుపతి కుటుంబానికి ముప్పు ఏర్పడుతుంది. మరి ఆ కష్టం నుండి కృష్ణప్రసాద్ వారిని తప్పించాడా..? శృతిని పెళ్లి చేసుకున్నాడా..? అనేదే మిగతా కథ.

ప్లస్ పాయింట్స్ :
కథ
గోపిచంద్ నటన
ఇంటర్వల్ బ్యాంగ్
యాక్షన్ సీన్స్

మైనస్ పాయింట్స్:
కథనం
హీరోయిన్స్
అసంధర్భానుసారంగా వచ్చే పాటలు
అనవసరపు సన్నివేశాలు

విశ్లేషణ:
ఇది పక్కా కమర్షియల్ ఫార్మాట్ లో తెరకెక్కించిన సినిమా. అయితే దర్శకుడు అనుకున్న కథ మాత్రం మెచ్చుకోదగిన విధంగా ఉంది. సోషల్ కాజ్ తో కూడిన కథను రొటీన్ కథనంతో చెప్పి ప్రేక్షకులను విసిగించారు. ఫస్ట్ హాఫ్ సో.. సో.. గా నడిచింది. ఇంటర్వల్ బ్యాంగ్ ఆకట్టుకుంటుంది. సెకండ్ హాఫ్ లో కథను బలంగా నడిపించలేకపోయారు. దీంతో సినిమా చూసే ప్రేక్షకులకు విసుగుపుట్టడం ఖాయం. చాలా కాలంగా హిట్స్ లేక బాధ పడుతున్న గోపిచంద్ కు ఈ ‘ఆక్సిజన్’ అయినా ఊపిరి పోస్తుందనుకుంటే ఇది కూడా దెబ్బకొట్టేసింది.

Critics METER

Average Critics Rating: 2
Total Critics:3

AUDIENCE METER

1 Star2 Stars3 Stars4 Stars5 Stars (No Ratings Yet)
Loading...
movie-poster

Critic Reviews for The Boxtrolls

ఆక్సిజన్‌ అందలేదు!
Rating: 1.75/5

www.klapboardpost.com

ఆక్సిజన్.. ఊపిరాడనివ్వదు!
Rating: 1.5/5

http://www.tupaki.com

ఆక్సిజన్‌ అందలేదు!
Rating: 1.5/5

http://telugu.greatandhra.com