పవన్ సినిమాకు గ్యాప్ తప్పదా..?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో సెట్స్ వేసి చిత్రీకరిస్తున్నారు. మొదటగా ఈ సినిమాను సెప్టెంబర్ లో విడుదల చేయాలనుకున్నారు కానీ ఇప్పుడు అది కాస్త సంక్రాంతికి పోస్ట్ పోన్ అయిందని టాక్. దీంతో షూటింగ్ కూడా హడావిడి లేకుండా మెల్లగా చేసుకోవచ్చు. అందుకేనేమో.. పవన్, త్రివిక్రమ్ లు సినిమాకు కొన్ని వారాల పాటు బ్రేక్ ఇవ్వాలని భావిస్తున్నారు. త్రివిక్రమ్, పవన్ కలిసి నితిన్ హీరోగా ఓ సినిమాను మొదలుపెట్టిన సంగతి తెలిసిందే.
జులై నుండి ఆ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. దీంతో ఆ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఇతర పనులను గాడిలో పెట్టి తమ సినిమాను మొదలుపెట్టాలని అనుకుంటున్నారట. దీంతో పాటు మరో కారణం కూడా ఉందని తెలుస్తోంది. పవన్ కల్యాణ్ రాజకీయంగా కొన్ని కార్యక్రమాలు నిర్వహించాలని భావిస్తున్నాడు. ప్రత్యేకహోదా అంశాన్ని మరోసారి తెరపైకి తీసుకురావాలనుకుంటున్నారు. కాబట్టి వీటికి కాస్త సమయం కావాలి. ఆ కారణంగానే షూటింగ్ కు గ్యాప్ ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.