నా హత్యకు కుట్ర చేస్తున్నారు: పవన్‌

ఈ రోజు పశ్చిమగోదావరి ఏలూరు పాతబస్టాండ్‌ సెంటర్‌లో జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సంచలన ఆరోపణలు చేశారు. ముగ్గురు వ్యక్తులు తనను హత్య చేయాలని కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. తనను హత్య చేసేందుకు ప్లాన్‌ కూడా రెడీ చేశారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లోగా తనను చంపిస్తే అడ్డు తొలగుతుందనుకుంటున్నారని పవన్‌ పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి తన వద్ద కచ్చితమైన సమాచారం ఉందన్న పవన్.. తనను హత్య చేసేందుకు ఎవరు ప్రయత్నిస్తున్నారో కూడా తనకు తెలుసన్నారు పవన్‌ కల్యాణ్ అన్నారు.