‘కొడకా కోటేశ్వరా’ పవన్ కొత్త పాట!

పవన్ కళ్యాన్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘అజ్ఞాతవాసి’ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.  ఈ చిత్రానికి సంబంధించి ఈ మద్య ఓ సాంగ్ కూడా రిలీజ్ అయ్యింది.  మొదటి నుంచి సినిమాపై ఎలాంటి అప్ డేట్స్ ఇవ్వకుండా చాలా జాగ్రత్తలు పడుతున్నారు చిత్ర యూనిట్. ఇక పవన్ – త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చే సినిమాలో ఓ సెంటిమెంట్ ఫాలో అవుతున్నారు. అదే పవన్ కళ్యాణ్ తో పాట పాడించడం.

అత్తారింటికి దారేది చిత్రంలో ‘కాటమ రాయుడా’ సాంగ్ కి ఏ రేంజ్ లో పాపులారిటీ వచ్చిందో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా మరోసారి పవన్ తన గొంతు వినిపించబోతున్నట్లు తెలుస్తుంది. ఈ సారి పవన్  ‘కొడకా కోటేశ్వర రావా..’ అంటూ ఫాన్స్ ని అలరించబోతున్నారు.  ఈ చిత్రానికి అనిరుద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. డిసంబర్ రెండో వారంలో పాటలు విడుదల చేసి జనవరిలో సంక్రాంతి కానుకగా సినిమాను
విడుదల చేయాలనుకుంటున్నారు.