పవన్, నేసన్ సినిమా లేనట్లే!

పవన్ కల్యాణ్ హీరోగా నేసన్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందాల్సివుంది. పూజా కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. ఏ.ఎం.రత్నం ఈ సినిమా నిర్మించాలనుకున్నారు. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేస్తోన్న పవన్ ఈ సినిమా పూర్తయిన వెంటనే నేసన్ సినిమాను పట్టాలెక్కించాలని. కానీ ఇప్పుడు ఆ సినిమా లేదని సమాచారం. తాజా సమాచారం ప్రకారం పవన్ ఆ సినిమా కోసం తీసుకున్న అడ్వాన్స్ కూడా తిరిగి ఇచ్చేశాడట. అసలు ఈ ప్రాజెక్ట్ నుండి పవన్ ఎందుకు తప్పుకున్నాడనే విషయంలో క్లారిటీ లేదు.

2019 ఎన్నికల కోసం తన జనసేన పార్టీను బలోపేతం చేయాలనుకుంటున్నాడు పవన్. దీనికోసం ఆయన కొంత గ్యాప్ తీసుకుంటాడనే ప్రచారం జరుగుతోంది. మరోపక్క మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై సినిమా చేయడానికే ఆయన నేసన్ సినిమా పక్కన పెట్టాడని అంటున్నారు. కారణం ఏదైనా.. నేసన్ సినిమా నుండి పవన్ తప్పుకున్నది వాస్తవమే అనేవాళ్లు ఎక్కువమంది ఉన్నారు. ఎన్నికల నేపధ్యంలో ఎక్కువ సినిమాలు పెట్టుకుంటే తన పొలిటికల్ కెరీర్ దెబ్బ తింటుందని పవన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లున్నాడు!