పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. సినిమాల కంటే వ్యక్తిగతంగా ఆయనను ఇష్టపడే వారి సంఖ్య ఎక్కువ ఉంటుంది. అటువంటి పవన్ ఇటీవల అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీలో జరిగిన ఓ సదస్సుకు హాజరయ్యాడు. అప్పుడు అక్కడ ఉన్న ఆయన అభిమానులు పవన్ ను ఆప్యాయంగా పలకరించారు. పవన్ కూడా కొంతసమయం తీసుకొని వారితో ముచ్చటించారు. అయితే పవన్ కు పెర్శనల్ గా గుంటూరు శేషేంద్ర శర్మ రచించిన ‘ఆధునిక మహాభారతం’ అనే పుస్తకం బాగా ఇష్టం.
యువకులను మేల్కొలిపి వారిలో చైతన్య స్ఫూర్తిని నింపే ఆలంటి పుస్తకం ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో పవన్ తన సొంత ఖర్చులతో ఆ పుస్తకాన్ని రీ ప్రింట్ చేయించి మార్కెట్ లో అందరికీ అందుబాటులో ఉండేలా చూసుకున్నాడు. పవన్ అమెరికా పర్యటనలో కొందరు అభిమానులు తమకు ఆ పుస్తకం కావాలని కోరారట. దీంతో పవన్ వారికి ఈమెయిల్ ద్వారా ఆ పుస్తకాన్ని పంపించినట్లు తెలుస్తోంది.













