వర్మ ఆ బయోపిక్ పక్కన పెట్టేశాడా..?

వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలిచే రామ్ గోపాల్ వర్మ కొద్ది రోజుల క్రితం స్వర్గీయులు నందమూరి తారక రామారావు జీవిత చరిత్రను సినిమాగా తెరకెక్కించబోతున్నట్లు ప్రకటించారు. అంతేకాదు.. జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్ అంటూ ఒక పాటను కూడా విడుదల చేశారు. అయితే దాని తరువాత నుండి ఇప్పటివరకు ఆ సినిమాకు సంబంధించి ఎలాంటి ప్రకటన చేయలేదు. గతంలో కూడా ఆయన ఇదే మాదిరి హడావిడి చేసి మధ్యలో ఆపేసిన సినిమాలు చాలానే ఉన్నాయి. ఇప్పుడు ఎన్టీఆర్ బయోపిక్ కూడా అదే కోవలోకి చెందుతుందని అంటున్నారు.
ఎన్టీఆర్ బయోపిక్ ను సినిమాగా చేస్తానని ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చిన వర్మ.. ఆ సినిమాలో ఎన్టీఆర్ పాత్రకు గాను బాలకృష్ణను తీసుకుంటారని అన్నారు. దీంతో సినిమాలో ఎన్టీఆర్ పాత్రను ఎలా ప్రెజంట్ చేయబోతున్నారు..? మిగిలిన పాత్రల తీరుతెన్నులు ఏవిధంగా చూపిస్తాడనే ఆసక్తి అందరిలో నెలకొంది. కానీ బాలయ్య ఈ ప్రాజెక్ట్ పై పెద్దగా ఆసక్తి చూపడం లేదని.. సమాచారం. ఆ కారణంగానే వర్మ ఇప్పుడు మరో ఆర్టిస్ట్ తో సినిమా చేసే అవకాశం ఉందని అంటున్నారు. కానీ ఈ విషయంపై వర్మ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో ఈ ప్రాజెక్ట్ ను పక్కన పెట్టేశారనే వార్తలు వినిపిస్తున్నాయి. 
 
 
Attachments