పాయల్ రాజ్‌పుత్ ‘ఆర్డీఎక్స్ లవ్’ టీజర్ విడుదల


పంజాబీ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్.. ఆర్‌ఎక్స్100 చిత్రంతో తెలుగు తెరపై అందాల ఆరబోసి కుర్రకారును కట్టిపడేసింది. ఆ సినిమా తర్వాత అమ్మడికి ఫుల్ ఫాలోయింగ్ వచ్చింది. తొలి సినిమాలోనే ఛాలెంజింగ్ పాత్ర చేసి ఔరా అనిపించుకుంది పాయల్. ఇక ఇప్పుడు మరోసారి ఆర్డీఎక్స్ లవ్ సినిమాతో కుర్రకారుని మరోసారి మురిపించనుందీ ముద్దుగుమ్మ. ఆవకాయ బిర్యానీ, హుషారు చిత్రాల్లో నటించిన తేజస్ హీరోగా నటిస్తున్నాడు. శంకర్ భాను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను సి.కళ్యాణ్ నిర్మించాడు. ఈ సినిమా సెప్టెంబర్‌లో విడుదల కానుంది. టీజర్ చూసిన తర్వాత పూర్తిగా పెద్దలకు మాత్రమే అనిపించేలా కట్ చేశారని అర్థమైంది.

మరీ ముఖ్యంగా కేవలం అడల్ట్ కంటెంట్ మాత్రమే ఉండేలా టీజర్ కట్ చేసిన దర్శకుడు.. ట్రైలర్‌లో మాత్రం పూర్తి వేరియేషన్ చూపించాడు. అసలు టీజర్, ట్రైలర్‌కు ఏ మాత్రం సంబంధం లేకుండా అద్బుతమైన స్ట్రాటజీ చూపించాడు. పాయల్‌ను కేవలం స్కిన్ షో కోసమే ఎంచుకున్నాడేమో అనేంతగా టీజర్ వస్తే.. ట్రైలర్‌లో మాత్రం ఫుల్లుగా సీరియస్ కథ చెప్పాడు. ఈ సారి యాక్షన్ కమ్ రొమాంటిక్ రోల్ చేస్తుంది పాయల్. హీరో మాదిరే ఈ చిత్రంలో ఫైట్లు కూడా చేసింది. ఆర్డీఎక్స్ లవ్ ట్రైలర్ ఓ ఊరు నేపథ్యంలో సాగుతుంది. ప్రస్తుతం ఈ సినిమాతో పాటు వెంకటేష్, నాగ చైతన్య హీరోలుగా నటిస్తున్న వెంకీ మామ సినిమాలోనూ పాయల్ నటిస్తోంది. మరోవైపు రవితేజ పక్కన డిస్కోరాజా సినిమాలో హీరోయిన్‌గా చేస్తోంది.