బాలయ్యతో ‘ఆర్ ఎక్స్ 100’ భామ!


టాలీవుడ్‌ ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శీను తో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాలో ‘ఆర్ ఎక్స్ 100’ బ్యూటీ పాయల్ రాజపుత్ కి ఛాన్స్ వచ్చిందని ఫిలిం నగర్ వార్తలు వినిపిస్తున్నాయి. కాగా ఇప్పటికే బాలయ్య సరసన ఇప్పటికే శ్రియ, అంజలి పేర్లు వినిపించాయి. కాకపోతే ఈ మూవీలో శ్రియా నటిస్తుందా లేదా అన్న విషయంపై క్లారిటీ మాత్రం రావ్వలేదు. ఈ నేపథ్యంలో పాయల్ పేరు తెరపైకి వచ్చింది. ఇక ఈ అమ్మడి గ్లామర్ డోస్ ఎక్కువ కాబట్టి పాయల్ ను కన్ఫామ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక పాయల్ ‘ఆర్ ఎక్స్ 100’ సినిమాలో తన అందాలతో కుర్రకారును కట్టిపడేసిన విషయం తెలిసిందే. ఆ మద్య వెంకటేష్, నాగ చైతన్య నటించిన వెంకిమామలో నటించింది. మరి బాలయ్య, బోయపాటి సినిమా కాబట్టి పక్క హిట్ అవుతుందని పాయల్ కూడా భావిస్తుంది ఈ సినిమా హిట్ అయితే ఈ హాట్ బ్యూటీకి మరిన్ని ఆఫర్లు వెతుకుంటూ వస్తాయి అనడంలో సందేహం లేదు.