పుష్పలో ఐటమ్‌ సాంగ్‌.. క్లారిటీ ఇచ్చిన బ్యూటీ

స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డైరెక్షన్‌లో వస్తున్న చిత్రం ‘పుష్ప’. ఈ చిత్రంలో హాట్‌ పాయల్ రాజ్ పుత్‌.. ఐటెమ్ సాంగు చేయనున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ వార్తలపై స్పందించింది పాయల్. ఇలాంటి పుకార్లు ఎలా పుడతాయో అర్థం కావడంలేదని వాపోయింది. ‘పుష్ప’ సినిమాలో తాను ఎలాంటి పాటలో నటించడంలేదని స్పష్టం చేసింది. ఈ విషయంలో తననెవరూ సంప్రదించలేదని వెల్లడించింది. ‘పుష్ప’ చిత్రంతో పాటు ‘ఇండియన్-2’ చిత్రంలో మీరు ఐటెమ్ సాంగులు చేస్తున్నారట కదా అంటూ గత కొన్నిరోజులుగా తనకు ఎన్ని మెసెజ్‌లు వచ్చాయో దేవుడికే తెలుసని పేర్కొంది. ఇవన్నీ రూమర్లేనని, ప్రస్తుతం తాను ఏ సినిమా చిత్రీకరణలో పాల్గొనడంలేదని స్పష్టం చేసింది ఈ ముద్దుగుమ్మ.

CLICK HERE!! For the aha Latest Updates