
Tollywood Senior Heroes Remuneration:
Tollywood Senior Heroes నందమూరి బాలకృష్ణ, వెంకటేష్ ఇద్దరూ వరుస విజయాలతో దూసుకెళ్తున్నారు. ‘డాకు మహారాజ్’, ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలు బాక్సాఫీస్‌ను షేక్ చేశాయి. వీరి సక్సెస్ చూస్తుంటే, వయసు మీద పడినా స్టార్ పవర్ తగ్గదని మరోసారి రుజువైంది.
బాలయ్య బాబు 64 ఏళ్ల వయస్సులోనూ ఓ రేంజ్‌లో దూసుకెళ్తున్నారు. ఇటీవలే పద్మ భూషణ్ అందుకున్నారు. ఇక ‘డాకు మహారాజ్’ కూడా పెద్ద హిట్ అయింది. ఇప్పుడు ‘అఖండ 2 తాండవం’ సినిమా చేస్తూ బిజీగా ఉన్నారు. ఈ సినిమా కోసం కుంభమేళా వద్ద భారీ యాక్షన్ సీన్స్ చిత్రీకరించారు. సంయుక్త మీనన్ ఈసారి హీరోయిన్‌గా ఎంపికయ్యారు.
ఈ సినిమా కోసం బాలకృష్ణ రూ. 40-45 కోట్లు తీసుకుంటున్నారు. డైరెక్టర్ బోయపాటి శ్రీను అయితే రూ. 30 కోట్లు తీసుకుంటున్నారు. మొత్తం బడ్జెట్ దాదాపు రూ. 175 కోట్లు. సంగీతం మాత్రం మళ్లీ థమన్ అందిస్తున్నారు.
‘సైంధవ్’ ఫ్లాప్ అయ్యాక, వెంకటేష్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ తో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చారు. ఇది దాదాపు రూ. 300 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి సూపర్ హిట్ అయింది. ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాను బ్రహ్మాండంగా ఎంజాయ్ చేశారు.
వెంకటేష్ పారితోషికం సాధారణంగా రూ. 10-12 కోట్లు మాత్రమే. కానీ ఈ విజయంతో రూ. 25 కోట్ల దాకా డిమాండ్ చేసే అవకాశం ఉంది. ఇప్పుడు ఆయన సంక్రాంతి 2026 కోసం మరో పెద్ద సినిమాను ప్లాన్ చేస్తున్నారు.
బాలకృష్ణ మాస్ యాక్షన్ మూవీస్‌లో రూల్ చేస్తుంటే, వెంకటేష్ ఫ్యామిలీ ఆడియన్స్‌ను మెస్మరైజ్ చేస్తున్నారు. వయసుతో సంబంధం లేకుండా వీరి విజయాలు టాలీవుడ్‌లో సీనియర్ హీరోలు ఇంకా ఎంత బలంగా ఉన్నారో చూపిస్తున్నాయి. చిరంజీవి సీనియర్ హీరోల్లో ముందుండగా, బాలయ్య, వెంకీ కూడా పోటీలో ఉన్నారు.













