ఊరమాస్‌గా రకుల్‌ ‘మన్మథుడు 2’ టీజర్‌

ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున హీరోగా నటిస్తున్న సినిమా ‘మన్మథుడు 2’. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, కీర్తి సురేశ్‌ ఈ చిత్రంలో హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో రకుల్‌ పాత్రకు సంబంధించిన టీజర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఇందులో రకుల్‌ పేరు అవంతిక. ‘అవంతిక.. పేరు ఎంత సూపర్‌గా ఉందో అంత పద్ధతిగల అమ్మాయి’ అన్న డైలాగ్‌తో రకుల్‌ పాత్రను పరిచయం చేశారు. కానీ ఆమె పైకి చూడటానికి సంప్రదాయంగా కనిపిస్తూనే మరోపక్క ఊరమాస్‌గా ప్రవర్తిస్తూ ఉంటారు. సిగరెట్లు తాగుతూ గడుసు పిల్లలా ప్రవర్తిస్తుంటారు. ‘రెండు సంవత్సరాలుగా ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నా’ అని నాగార్జున రకుల్‌కు చెప్తారు. ఇందుకు రకుల్‌ పడి పడి నవ్వుతూ.. ‘ఈ వయసులో నువ్వు లవ్‌ ఫెయిల్యూర్‌ తట్టుకోలేవ్’ అనడం నవ్వులు పూయిస్తోంది. రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు రానుంది. వెన్నెల కిశోర్‌, లక్ష్మీ, రావూ రమేష్‌, ఝాన్సీ, దేవదర్శిని ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు చైతన్య భరద్వాజ్‌ సంగీతమందిస్తున్నాడు.