HomeTelugu Trending'పర్ ఫ్యూమ్' ట్రైలర్ రిలీజ్

‘పర్ ఫ్యూమ్’ ట్రైలర్ రిలీజ్

Perfule trailer‘పర్ ఫ్యూమ్’ సినిమాలో ఓ కారణంగా అమ్మాయిలను సైకో ఫాలో అవుతూ ఉంటాడు. సమయం, సందర్భం కలిసొచ్చినప్పుడు అమ్మాయిలను తన వలలో వేసుకుంటాడు. ఈ సినిమా టైటిల్ ‘పర్ ఫ్యూమ్’ కావడం వలన, ఆ సైకో కొంతమంది అమ్మాయిలను ఎందుకు టార్గెట్ చేస్తున్నాడనేది అర్థం చేసుకోవచ్చు.

‘పర్ ఫ్యూమ్’ సినిమా నుంచి ట్రైలర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇది స్మెల్ బేస్డ్ థ్రిల్లర్ స్టోరీ అనే విషయం ఈ ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. స్మెల్ కారణంగా ఓ సైకో అమ్మాయిలను వెంటాడటం, వేటాడటం, ప్రేమ పేరుతో వేధించడం ట్రైలర్‌లో కనిపిస్తుంది. సైకోను పట్టుకోవడానికి పోలీసులు సతమతమవుతూ ఉంటారు.

‘పర్ ఫ్యూమ్’ సినిమాకు దుర్గాస్వామి దర్శకత్వం వహించాడు. చేనాగ్, ప్రాచీ థాకర్, అభినయ ప్రధాన పాత్రలను పోషించిన ఈ సినిమాను, సుధాకర్, రాజీవ్ కుమార్ నిర్మించారు. ఈ సినిమాను ఈ నెల 24న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu