HomeTelugu Newsవర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్' వ్యతిరేకంగా హైకోర్ట్ లో పిటిషన్..!

వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ వ్యతిరేకంగా హైకోర్ట్ లో పిటిషన్..!

1 22వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎన్టీఆర్ బయోపిక్‌ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సినిమా షూటింగ్ చాలా వరకు పూర్తయింది. అతి త్వరలోనే సినిమాను థియేటర్స్ లోకి తీసుకొస్తామని వర్మ ప్రకటించాడు. అంతేకాదు, ఈ సినిమాకు సంబంధించిన ఎన్టీఆర్ లుక్ ను విడుదల చేస్తూ.. ఎన్టీఆర్ పునర్జీవనం అంటూ క్యాప్షన్ ఇచ్చాడు.

అంతకు ముందు వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాకు సంబంధించిన రెండు సాంగ్స్ ను రిలీజ్ చేశాడు. ఈ రెండు కూడా ఎన్టీఆర్ వలన ఇబ్బందులు పడ్డాడు, ఎవరి వలన పతనం అయ్యారు అనే విషయాల గురించి చెప్తూ వచ్చినవే.

లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాకు వ్యతిరేకంగా తూర్పు గోదావరి జిల్లా, పిఠాపురం ఎమ్మెల్యే వర్మ హైకోర్ట్ లో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశాడు. ఈ పిటిషన్ ను హైకోర్ట్ స్వీకరించింది. ఈ పిటిషన్ పై స్పందించిన హైకోర్ట్, లక్ష్మీస్ ఎన్టీఆర్ నిర్మాత, దర్శకుడు, సెంట్రల్ సెన్సార్ బోర్డు కు నోటీసులు జారీ చేయాలని ఆదేశించింది. నాలుగు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. మరి వర్మ ఎలా స్పందిస్తుందో చూడాలి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!